స్వచ్చ సర్వేక్షణ్ లో హైదరాబాద్ కు 23వ ర్యాంక్
BY Telugu Gateway20 Aug 2020 4:29 PM IST

X
Telugu Gateway20 Aug 2020 4:29 PM IST
విజయవాడ 4..విశాఖపట్నానికి 9వ ర్యాంకు
స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకుల్లో హైదరాబాద్ 23వ ర్యాంక్ కు పరిమితం అయింది. ఏపీకి చెందిన విజయవాడ నాల్గవ ర్యాంకులో నిలవగా...విశాఖపట్నం తొమ్మిదివ ర్యాంకు సాధించింది. పది లక్షలకు పైబడిన ప్రజలు ఉండే నగరాలకు సంబంధించిన ర్యాంకుల్లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వరసగా నాలగవసారి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. రెండవ ర్యాంకులో సూరత్ ఉండగా..మూడవ ర్యాంకులో నవీ ముంబయ్ నిలిచింది.
కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ హర్దీప్ సింగ్ పూరి ఈ జాబితాను విడుదల చేశారు. పది లక్షల లోపు జనాభా కలిగిన వాటిలో తిరుపతి 6వ ర్యాంకు సాధించగా, రాజమహేంద్రవరం 51, ఒంగోలు 57, కాకినాడ 58, కరీంనగర్ 72, తెనాలి 75, కడప 76, చిత్తూరు 81 ర్యాంకులను సాధించాయి.
Next Story