Telugu Gateway
Latest News

ఆన్ లైన్ క్లాసుల కోసం చెట్లు..కొండలెక్కుతున్న పిల్లలు

ఆన్ లైన్ క్లాసుల కోసం చెట్లు..కొండలెక్కుతున్న పిల్లలు
X

ఆన్ లైన్ క్లాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం. ముఖ్యంగా కళ్ళపై. ఇది నెట్ బాగా అందుబాటులో ఉన్న వారి సమస్య. ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ కూడా ఓ పనైపోతుంది అన్నట్లు ఒకేసారి వరసపెట్టి ఏకంగా ఐదు క్లాసులు లాగించేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే దేశంలోని పలు ప్రాంతాల్లో నెట్ సౌకర్యం లేక పిల్లలు నానా అగచాట్లు పడుతున్నారు ఒడిశాలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణం. పలు గ్రామాల్లో పిల్లలు ఇంటర్ నెట్ కనెక్టివిటి కోసం ఏకంగా చెట్లు ఎక్కడటంతోపాటు..కొండలపైకి ఎక్కుతున్నారు. అలా చేస్తే తప్ప వీరికి ఇంటర్నెట్ కనెక్టివిటి దొరకదు..క్లాసులు వినటం సాధ్యం కాదు.

ఇంటర్నెట్ కనెక్టివిటి ఏ మాత్రం సరిగా లేనందు వల్ల చాలా మంది పిల్లలు కిలోమీటర్ల మేర నడిచి మరీ కొండలు ఎక్కుతున్నారని ఒడిశా పాఠశాల విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ తెలిపారు. ప్రస్తుతం ఒడిశాలో 22 లక్షల మంది విద్యార్దులు ఈ ఎడ్యుకేషన్ సౌకర్యం పొందుతుండగా..మిగిలిని 38 లక్షలు మంది మాత్రం తమ తమ ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్...ఇంటర్నెట్ కనెక్టివిటి లేకపోవటం వల్ల ఆన్ లైన్ క్లాస్ లకు హాజరు కాలేకపోతున్నారు. కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకూ ఆగమేఘాల మీద స్కూళ్లను తెరవాలనే ఆలోచన అయితే తమకు ఏ మాత్రం లేదని తెలిపారు.

Next Story
Share it