రిలయన్స్ పై సౌదీ అరామ్ కో కీలక ప్రకటన
BY Telugu Gateway10 Aug 2020 12:32 PM IST

X
Telugu Gateway10 Aug 2020 12:32 PM IST
ప్రపంచంలోని అతి పెద్ద క్రూడ్ ఉత్పత్తి సంస్థ సౌదీ అరామ్ కో. రిలయన్స్ లో పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రిలయన్స్ ఆయిల్, కెమికల్స్ విభాగంలో తాము 15 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తితోనే ఉన్నట్లు సంస్థ సీఈవో అమిన్ నాసర్ తెలిపారు. ఊహించని పరిణామాలతోపాటు కోవిడ్ 19 కారణంగా రిలయన్స్, సౌదీ అరామ్ కో ఒఫ్పందం అనుకున్న విధంగా ముందుకు సాగలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జులైలో జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ సమావేశంలో ముఖేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కరోనా సంక్షోభ సమయంలోనూ జియోలోకి రిలయన్స్ భారీ ఎత్తున నిధులు రాబట్టిన సంగతి తెలిసేందే.
Next Story