Telugu Gateway
Latest News

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ రేసులో పతంజలి

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ రేసులో పతంజలి
X

పతంజలి. ఈ బ్రాండ్ గత కొన్నేళ్లుగా భారత్ లో అత్యంత పాపులర్ అయింది. అదే సమయంలో వివాదాలు తక్కువేమీ కాదు. కరోనా సంక్షోభ సమయంలో పతంజలి తీసుకొచ్చిన కరోనా మందు ‘కరోనిల్’ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. తొలుత ఈ కరోనిల్ మందు వాడితే కరోనా తగ్గిపోతుందని ప్రచారం చేశారు. దీనిపై అటు కేంద్రంతోపాటు పలు నియంత్రణా సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసేందే.

అయితే ఇప్పుడు పతంజలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాన్సర్ షిప్ దక్కించుకునే పనిలో పడింది. తాజాగా చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవటంతో పతంజలి కూడా ఈ రేసులో ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒకటి కథనాన్ని ప్రచురించింది. పతంజలి బ్రాండ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Next Story
Share it