Telugu Gateway
Latest News

ఖైరతాబాద్ గణేషుడు తొమ్మిది అడుగులే

ఖైరతాబాద్ గణేషుడు తొమ్మిది అడుగులే
X

అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలపై కరోనా దెబ్బ పడింది. ఈ సారి ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం తొమ్మిది అడుగులకే పరిమితం కానుంది. అది కూడా మట్టి విగ్రహం. ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించిన 66 సంవత్సరాల్లో ఇంత చిన్న విగ్రహం పెట్టడం ఇదే మొటిసారి కావటం విశేషం. ఈ సారి నిమజ్జనం కూడా విగ్రహం ఏర్పాటు పక్కనే జరగనుంది.

శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నాడు. బుధవారం నాడు విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సారి భక్తులను అనుమతించకూడదని నిర్ణయించారు. ఇందుకు భక్తులు కూడా సహకరించాలని కమిటీ విన్నవించింది. విగ్రహానికి కుడివైపున లక్ష్మీ దేవి, ఎడవ వైపున సరస్వతి దేవి ప్రతిమలు కూడా ఉంచనున్నారు.

Next Story
Share it