Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ట్రంప్ వి అవకాశవాద రాజకీయాలు

0

అమెరికాలో హోరాహోరీ మొదలైంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రచారపర్వం ఊపందుకుంది. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్, తాజాగా ప్రకటించిన ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలాహారిస్ తొలిసారి ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా కరోనాను నియంత్రించటంలో ట్రంప్ వైఫల్యం ఈ సారి అత్యంత కీలకంగా మారనుంది. ఇదే ఆయన ఓటమికి కారణం అవుతుందనే వాదన కూడా బలంగా విన్పిస్తోంది. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వీరు తమ  అస్త్రాలుగా మార్చుకోనున్నారు. క్లైమెట్ చేంజ్ పై నిర్ణయాన్ని మార్చుకోవడం, వెల్లువెత్తిన నిరసనలను వీరు ప్రస్తావిస్తున్నారు.

- Advertisement -

ట్రంప్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ట్రంప్ అసమర్థతవల్ల దేశం రోగాల పాలైందని, మరణాలు సంభవించాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని మండిపడ్డారు. జాతి నాయకత్వలేమిలో కూరుకుపోయిందని, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం క్లిష్టతరమవుతోందని విమర్శించారు. వీళ్ళ ప్రచారసభ ముగిసిన 2 గంటల్లోనే ట్రంప్ స్పందించారు. కమలాహారిస్ ఓ పిచ్చిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జో బిడెన్ ను  ఆమె అవమానపరిచినంతగా మరెవరూ అవమానించలేదని, అతని గురించి ఎన్నో భయంకర విషయాలను చెప్పిందన్నారు. ఇప్పుడవన్నీ మర్చిపోయి, ఉపాధ్యక్ష పదవికోసం ఆయన్ను అద్భుతమైనవ్యక్తిగా కొనియాడుతోందని మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.