Telugu Gateway
Latest News

ప్రపంచంలోనే ఆ జాబితాలో చేరిన తొలి వ్యక్తి జెఫ్ బెజోస్

ప్రపంచంలోనే ఆ జాబితాలో చేరిన తొలి వ్యక్తి జెఫ్ బెజోస్
X

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 200 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. ఈ క్లబ్ లో చేరిన ప్రపంచంలోని తొలి వ్యక్తే ఆయనే కావటం విశేషం. ఈ 56 సంవత్సరాల వయస్సు ఉన్న జెఫ్ బెజోస్ సంపద ఇఫ్పుడు ఏకంగా 205 బిలియన్ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద సంపన్నుడు అయిన బిల్ గేట్స్ కంటే బెజోస్ సంపద 89 బలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం బిల్ గేట్స్ సంపద 116.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ ఏడాది జనవరి 1న బెఫ్ బెజోస్ సంపద 115 బిలియన్ డాలర్లుగానే ఉంది. కానీ ఆగస్టు నాటికే ఇది ఏకంగా 200 బిలియన్ డాలర్లకు చేరింది అంటే ఏడు నెలల వ్యవధిలోనే ఏకంగా 85 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు స్పష్టం అవుతుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ తరుణంలో కూడా జెఫ్ బెజోస్ సంపద అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆన్ లైన్ సేల్స్ అనూహ్యంగా పెరగటమే.

Next Story
Share it