Telugu Gateway
Telangana

కుంభకర్ణుడిలా నిద్రపోతున్న తెలంగాణ సర్కారు

కుంభకర్ణుడిలా నిద్రపోతున్న తెలంగాణ సర్కారు
X

బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తీవ్ర విమర్శలు

తెలంగాణ సర్కారు పై బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. కరోనా విషయం లో తెలంగాణ సర్కారు కుంభకర్ణుడిలా నిద్రపోతోందని ఆరోపించారు. తెలంగాణలో ఏ మాత్రం స్పందన లేని బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని చూస్తున్నామని విమర్శించారు. తెలంగాణలోని బిజెపి జిల్లా కార్యాలయాల కార్యక్రమంలో పాల్గొన్న నడ్డా ఈ విమర్శలు చేశారు. కోవిడ్ మేనేజ్ మెంట్ లో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.

దేశంలో అతి తక్కువ టెస్ట్ లు చేస్తుంది తెలంగాణ రాష్ట్రమే అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరువలేనివి అని వ్యాఖ్యానించారు. సర్కారు తీరుపై హైకోర్టు కూడా పలు మార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని..ఆగ్రహం కూడా వ్యక్తం చేసిందని తెలిపారు. తెలంగాణలో కరోనా కారణంగా జర్నలిస్టులు కూడా చనిపోయారన్నారు. ఇదెక్కడి విధానం అని నడ్డా తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

Next Story
Share it