Telugu Gateway
Latest News

భారత్ లో కరోనా వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ స్టార్ట్

భారత్ లో కరోనా వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ స్టార్ట్
X

భారత్ లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. వ్యాక్సిన్ కు సంబంధించి నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తయారు అవుతున్న మూడు వ్యాక్సిన్లలో ఒకటి మూడవ దశ ట్రయల్స్ కు రెడీ అయిందని తెలిపారు. ఒక్రటెండు రోజుల్లోనే ఈ ట్రయల్స్ ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అయితే ఇది ఏ వ్యాక్సిన్ అన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. కానీ ఎక్కువ మంది ఇది ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటికి చెందిన వ్యాక్సిన్ అని భావిస్తున్నారు. భారత్ లో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నివహిస్తున్న విషయం తెలిసిందే. దేశీయ కంపెనీ భారత్ బయోటెక్ తొలి దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ దశ వైపు అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ తయారీ పనులో అగ్రశ్రేణి ఫార్మా సంస్థలు అన్నీ తలమునకలై ఉన్నాయి.

ఒక్క వ్యాక్సిన్ సక్సెస్ అయినా కూడా ప్రపంచ దేశాలు అన్నీ అటువైపు క్యూకట్టడానికి రెడీ అయ్యాయి. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ సిద్ధం అయిందని ప్రకటించటమే కాదు..ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అయితే పలు దేశాలు రష్యా వ్యాక్సిన్ కు సంబంధించిన డేటాను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి. రష్యా వ్యాక్సిన్ ఎంత సురక్షితం అయింది అనే అంశం తేలిన తర్వాతే పలు దేశాలు దీని విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనా కూడా ఓ వ్యాక్సిన్ కు సంబంధించి ఏకంగా పేటెంట్ హక్కులను కూడా పొందినట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా సాధ్యమైనంత త్వరగా కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడదామా అని ప్రపంచంగా అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

Next Story
Share it