Telugu Gateway
Latest News

మార్కెట్లో ఐదు వందల నోట్లదే హవా

మార్కెట్లో ఐదు వందల నోట్లదే హవా
X

ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న నగదులో ఐదు వందల రూపాయల నోట్లదే హవా. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఐదు వందల నోట్ల వాటా ఏకంగా 60.8కి శాతానికి పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇది 51.8 శాతంగా ఉంది. అదే సమయంలో రెండు వేల రూపాయల చలామణి 31.2 శాతం నుంచి 22.6 శాతానికి తగ్గుముఖం పట్టింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఆర్ బిఐ ఒక్కటంటే ఒక్క రెండు వేల రూపాయల నోటును ప్రింట్ చేయలేదు.

మొత్తం మీద చూస్తే ఎక్కువ సర్కులేషన్ లో ఉన్న నగదు అంటే ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లే ఉన్నాయి. వీటి తర్వాత వంద రూపాయల నోటే ఎక్కువ సర్కులేషన్ లో ఉంది. అయినా ఈ నోట్ల వాటా 9.5 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గుముఖం పట్టింది. అయితే కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను ప్రింట్ చేయనంత మాత్రాన ఈ నోట్లను ఉపసంహరించుకునే అవకాశం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

Next Story
Share it