Telugu Gateway

కరోనా ఖతం అయ్యే టైమ్ దగ్గరకొచ్చిందా?!

కరోనా ఖతం అయ్యే టైమ్ దగ్గరకొచ్చిందా?!
X

40 శాతం కోవిడ్ బాధితుల్లో లక్షణాలే లేవు

ఇది చాలా మంది సంకేతం అంటున్న నిపుణులు

ఓ వైపు వ్యాక్సిన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి..లేదంటే 2021లో పక్కాగా వ్యాక్సిన్ రావటం ఖాయం అంటున్నారు. అయితే రష్యా మాత్రం మరికొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. దీనిపై అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యుహెచ్ వో) కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అన్ని ప్రమాణాలు పాటించకుండా వ్యాక్సిన్ విషయంలో తొందరపడకూడదని హెచ్చరిస్తున్నాయి. అయితే మరో వైపు అత్యంత కీలకమైన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా వచ్చినా కూడా 40 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకపోవటం కీలక పరిణామంగా చెబుతున్నారు. తమ పరిశోధనలో దాదాపు 40 శాతం కరోనా రోగులకు లక్షణాలు కనిపించడం లేదని ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధి వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ తెలిపారు. బోస్టన్ నిరాశ్రయుల ఆశ్రయంలో దాదాపు 147 మందికి కరోనా సోకితే.. 88 శాతం మందికి లక్షణాలే లేవని తమ పరిశోధనలో తేలిందని మోనికా గాంధీ పేర్కొన్నారు.

ఆర్క్‌ లోని స్ప్రింగ్‌డేల్‌లోని టైసన్ ఫుడ్స్ పౌల్ట్రీ ప్లాంట్‌లో 481 మంది కరోనా బారిన పడితే.. 95 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని తేలింది. అర్కాన్సాస్, నార్త్ కరోలినా, ఒహియో మరియు వర్జీనియాలోని జైళ్లలోని 3,277 ఖైదీలు కోవిడ్‌ బారిన పడగా.. 96శాతం మందిలో ఒక్క లక్షణం కూడా కనిపించలేదు. తీవ్ర లక్షణాలు కనిపించిన వారితో కలిసి ఉన్నవారిలో కొంతమందికి కరోనా సోకలేదు. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్లే వీరికి కోవిడ్‌ సోకలేదా? లేదా కరోనా వైరస్‌ మోతాదులో తేడా వల్ల వీరు కోవిడ్‌ బారిన పడలేదా అనేది మిస్టరీగా మారింది. అయితే ఈ మిస్టరీని చేధిస్తే టీకా లేదా వ్యాక్సిన్‌ అభివృద్ధిని వెగవంతం చేయవచ్చని గాంధీ వెల్లడించారు.

అలాగే రోగ నిరోధక శక్తికి కొత్త మార్గాలు సృష్టించవచ్చని చెప్పారు. ఈ దశగా పరిశోధనలు సాగిస్తే కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే కాకుండా దానిని నాశనం చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఏదేమైనా అధిక శాతం మందికి కరోనా లక్షణాలు కనిపించకపోవడం మంచి పరిణామం అని, సమాజానికి ఇది మంచి విషయం అని గాంధీ అభిప్రాయపడ్డారు. త్వరలోనే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనటానికి ఇది సంకేతంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it