Telugu Gateway
Latest News

ఒక్క జులైలో 50 లక్షల ఉద్యోగాలు ఔట్

ఒక్క జులైలో 50 లక్షల ఉద్యోగాలు ఔట్
X

కరోనా కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. లాక్ డౌన్..కరోనా సృష్టించిన విలయంతో ఫట్ మంటున్న ఉద్యోగాల సంఖ్య ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఒక్క జులై నెలలోనే ఏకంగా 50 లక్షల (5 మిలియన్లు) మంది వేతనాలతో కూడిన ఉద్యోగాలు పోయాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇంత భారీ స్థాయిలో పోవటం ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామంగా పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం మీద ఏకంగా 18.9 మిలియన్ల వేతనాలతో కూడిన ఉద్యోగాలు పోయాయని ఈ నివేదిక వెల్లడించింది. వేతనాలతో కూడిన ఉద్యోగాలు పోతే వాళ్లు తిరిగి అదే తరహా ఉద్యోగాలు పొందటం కూడా అంత తేలికైన వ్యవహారం కాదని సీఎంఐఈ పేర్కొంది.

అయితే కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే సాదారణ, వేతనేతర ఉద్యోగాల్లో మాత్రం కొంత పెరుగుదల కన్పిస్తోంది. గత ఏడాది ఈ ఉద్యోగాలు 317.6 మిలియన్లు ఉండగా..2020 జులై నాటికి ఇవి 325.6 మిలియన్లకు పెరిగాయి. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ లో చిన్న వ్యాపారులు, హాకర్లు, రోజువారీ కూలీలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు నివేదిక వెల్లడించింది. వ్యవసాయ ఉపాధి అంశానికి వస్తే జూన్ లో మంచి వృద్ధి రేటు కన్పిస్తోంది. వర్షాలు మంచిగా కురవటంతో ఇక్కడ పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోందని నివేదిక వెల్లడించింది.

Next Story
Share it