Telugu Gateway
Latest News

ప్రపంచంలో ఖరీదైన కారు ఇదే

ప్రపంచంలో ఖరీదైన కారు ఇదే
X

బుగట్టీ కారు ధర 75 కోట్లు

కొనుగోలు చేసిన ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టినో రొనాల్డో

క్రిస్ట్రినో రోనాల్డో. పోర్చుగల్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగట్టీ లా వోయాటర్ నోయిరీ కారు కొనుగోలు చేశాడు. దాని ధర ఎంతో తెలుసా?. అక్షరాలా భారతీయ కరెన్సీలో 75 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఇఫ్పటివరకూ ఈ కారు ఓనర్లు పది మంది మాత్రమే ఉన్నారు. అందులో క్రిస్టినో రొనాల్డో ఒకరు కాబోతున్నారు. ఈ కారును తనకు తాను గిఫ్ట్ గా ఇచ్చుకున్నాడు. ఈ విషయాన్ని రొనాల్డో తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ 35 సంత్సరాల ఫుట్ బాల్ ఆటగాడు తన పేరు వచ్చేలా సీఆర్ అని కారుపై రాయించుకోనున్నాడు. రొనాల్డో గ్యారెజ్ లో ఉండే మొత్తం కార్ల విలువ 264 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. బుగట్టీ లా వోయాటర్ గంటకు 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

క్రిస్టినో రోనాల్డోకు బుగట్టీ కారు 2021లో అందుబాటులోకి రానుంది. విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయటం క్రిస్టినో రొనాల్డోకు ఓ సరదా. అందుకే ఎన్నో సూపర్ కార్లను తన గ్యారేజ్ లో పెట్టేసుకున్నాడు. ఆయన దగ్గర ఫెరారీ 599 జీటీవో, లాంబొర్గిని అవెంటడోర్, మెక్ లారెన్ ఎంపీ4 12 సీ వంటి కార్లు ఉన్నాయి అంతే కాదు తన కొత్త కార్ల వివరాలను ఆ ఆటగాడు 233 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు. కార్లు ఒక్కటే కాదు ఈ ఫుట్ బాల్ ప్లేయర్ 5.5 మిలియన్ పౌండ్లు పెట్టి విలాసవంతమైన యాచ్ ను కూడా కొనుగోలు చేశారు. ఇందులో వివిధ రకాల లగ్జరీ క్యాబిన్లు ఉన్నాయి.

Next Story
Share it