Telugu Gateway
Telangana

ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్

ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్
X

తెలంగాణ సీఎం కెసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్ తెలంగాణకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చెయ్యడానికి ఏపీ జీవో రిలీజ్ చేస్తే కేసీఆర్ నుంచి కనీస స్పందన లేదన్నారు. పోతిరెడ్డిపాడు పూర్తి అయితే తెలంగాణ లో 25లక్షల ఎకరాల ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 5వ తేదీన అపెక్స్ భేటీకి పిలుస్తే సీఎం పట్టించుకోకుండా 20వ తేదీ తరువాత పెట్టమనడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఆగస్టు 20వ తేదీ లోపు పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వెయమన్నారని తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేసే సిఎంను ఇప్పటిదాకా చూడలేదు, తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని మల్లు భట్టి విక్రమార్కు తీవ్ర విమర్శలు చేశారు.

ఆయన మంగళవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ లో దళితుల పై దాడులు ఆగడం లేదన్నారు. దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువు అయిపోయిందని తెలిపారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంలో దళితుల పై సిరిసిల్ల దగ్గర నుంచి మొదలై గజ్వేల్ నుంచి రాజపూర్ వరకు దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దళితుల పై జరుగుతున్న దాడుల పై డీజీపీ కి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన లేదని విమర్శించారు. దళితుల పై జరుగుతున్న దాడులు గురించి గవర్నర్ కి ఫిర్యాదు చేస్తాం. కరోనా కారణంగా గవర్నర్ కి ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపుతున్నామని తెలిపారు. కరోనాను నియంత్రించటానికి ఇచ్చిన మార్గదర్శకాలను కాంగ్రెస్ ను కంట్రోల్ చేయటానికి వాడుకుంటున్నారని విమర్శించారు.

Next Story
Share it