Telugu Gateway
Latest News

‘ఆడి కారు’ యాడ్ దుమారం.. కంపెనీ క్షమాపణ

‘ఆడి కారు’ యాడ్ దుమారం.. కంపెనీ క్షమాపణ
X

ఆడి.. ఈ కారు ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ప్రీమియం సెగ్మెంట్. ఈ జర్మనీ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ యాడ్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. ఓ రెడ్ ఆడి కారు ముందు..ముద్దు ముద్దుగా ఉన్న ఓ చిన్న పాప స్టైల్ గా నిలుచుని అరటి పండు తింటూ ఉంటుంది. ఆ అమ్మాయి పోటో మాత్రం చాలా క్యూట్ గా ఉంది. అయితే ఈ యాడ్ పై మాత్రం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఇది ఏ మాత్రం ‘సున్నితత్వం లేని’ యాడ్ అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డ్రైవర్ కారులో కూర్చుంటే ముందు ఉన్న పాప కన్పించదని..ఇలాంటి ఏ మాత్రం సున్నితత్వం లేని యాడ్స్ ఎలా చేస్తారంటూ విమర్శలు గుప్పించారు.

మరి కొంత మంది ఈ యాడ్ పై మరింత ముందుకెళ్లి తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు..ఈ యాడ్ కింద పెట్టిన ట్యాగ్ లైన్ కూడా అభ్యంతరకరంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ‘ప్రతి అంశంలోనూ మీ హృదయ స్పందన వేగంగా ఉంటుంది’ (Lets your heart beat faster - in every aspect."). అని పేర్కొన్నారు. ఒక చిన్న పాపను యాడ్ లో పెట్టి అరటిపండు తింటూ ఈ క్యాప్షన్ పెట్టడం ఎలా చూసినా సమర్ధనీయం కాదు ఓ నెటిజన్ విమర్శించారు. ఈ వివాదంపై స్పందించిన ఆడి క్షమాపణలు చెప్పటంతో పాటు ఈ యాడ్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది ఎలా జరిగిందో కూడా తేలుస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియా దెబ్బకు ఆడి లాంటి సంస్థ తన తప్పును సరిదిద్దుకోవాల్సి వచ్చింది.

Next Story
Share it