యాపిల్ తొలి ఫ్లోటింగ్ స్టోర్
BY Telugu Gateway24 Aug 2020 3:52 PM GMT

X
Telugu Gateway24 Aug 2020 3:52 PM GMT
యాపిల్. ఆ ఫోన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెర్షన్లు తీసుకొస్తూ ప్రపంచ వ్యాప్తంగా తన మార్కెట్ కాపాడుకునే పనిలో విజయవంతం అవుతూ వస్తోంది ఈ ఆగ్రశ్రేణి సంస్థ. తాజాగా యాపిల్ సింగపూర్ లో ప్రపంచంలోనే తొలి ‘ఫ్లోటింగ్ స్టోర్’ను ఏర్పాటు చేయనుంది. సింగపూర్ లోని మెరీనా బే శాండ్స్ రిసార్ట్ వద్ద దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
డోమ్ తరహాలో ఉండే ఈ స్టోర్ చూపరులను విశేషంగా ఆకట్టుకోవటం ఖాయంగా కన్పిస్తోంది. సింగపూర్ లో ఈ ప్లోటింగ్ స్టోర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది సింగపూర్ లో యాపిల్ మూడవ స్టోర్ కానుంది. తొలి స్టోర్ ను 2017లో నైట్ బ్రిడ్జి మాల్ వద్ద ఏర్పాటు చేసింది. రెండవ స్టోర్ ను 2019లో జ్యువెల్ చాంగీ విమానాశ్రయంలో నెలకొల్పింది.
Next Story