Telugu Gateway
Latest News

వ్యాక్సిన్ పై అంటోనీ పౌచీ కీలక వ్యాఖ్యలు

వ్యాక్సిన్ పై అంటోనీ పౌచీ కీలక వ్యాఖ్యలు
X

ప్రపంచం మళ్లీ ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటుంది?. అసలు కోవిడ్ 19కి ముందు నాటి పరిస్థితి ఇప్పట్లో వస్తాయా?. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?. ఇలాంటి కీలక ప్రశ్నలు అన్నింటికి అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల చికిత్స నిపుణుడు అంటోని పౌచీ తాజాగా సమాధానం ఇచ్చారు. ఈ సంవత్సరాంతం నాటికి లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పౌచీ స్పష్టం చేశారు. అంతే కాదు..వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ప్రపంచం అంతటా సాధారణ పరిస్థితులు వస్తాయని కీలక ప్రకటన చేశారు. కరోనాకు సంబంధించి సమర్ధవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే మాత్రం పరిస్థితులు మరికొన్నేళ్ళ పాటు ఇలాగే కొనసాగుతాయని అన్నారు.

రష్యా వ్యాక్సిన్ పై కూడా పౌచీ స్పందించారు. ఆ వ్యాక్సిన్ ఎంత సురక్షితం అయిందనేది పరీక్షించిన తర్వాతే మాత్రమే ప్రజలకు ఇవ్వాలన్నారు. నవంబర్ 3 నాటికి వ్యాక్సిన్ సిద్ధంగా ఉండవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ, షాట్లు సాధారణ ప్రజలకు చేరడానికి 2021 వరకు పట్టవచ్చని ఫౌసీ అభిప్రాయపడ్డారు. స్మాల్ ఫాక్స్ పై తప్ప చరిత్రలో ఏ మహమ్మారిపైనా పూర్తి స్థాయిలో విజయం సాధించలేదని పౌచీ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలకంటే అంటోనీ పౌచీ వ్యాఖ్యలకే అమెరికా ప్రజలు ఎక్కువ విలువ ఇస్తారు. అంటు వ్యాధుల విభాగంలో పౌచీకి ఉన్న అనుభవం దృష్ట్యా ఆయన మాటలకు అంత విలువ ఉంటుంది.

Next Story
Share it