షాకింగ్..అమెరికాలో 50 లక్షలు దాటిన కేసులు
BY Telugu Gateway9 Aug 2020 3:55 PM GMT

X
Telugu Gateway9 Aug 2020 3:55 PM GMT
అమెరికా మరో ‘రికార్డు’ను దాటేసింది. ఆదివారం నాటికి దేశంలో కరోనా కేసులు 50 లక్షలు (ఐదు మిలియన్లు) దాటేశాయి. అంతే కాదు..మరణాల సంఖ్య కూడా 162,000 కు చేరింది. ప్రపంచంలోనే ఇంత భారీ సంఖ్యలో కేసులు..మరణాలు నమోదు అయిన దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికానే. జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటీ రియల్ టైమ్ డేటా తాజా లెక్కలను బహిర్గతం చేసింది. దీని ప్రకారం అమెరికాలో మొత్తం కేసులు 5,000,603గా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాము ఎంతో చేస్తున్నామని చెబుతున్నా దేశంలో కరోనా కేసులు..మరణాల సంఖ్యను నియంత్రించటంలో మాత్రం విఫలం అవుతూనే ఉన్నారు. ఈ విషయంలో ట్రంప్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతే కాదు..ఇది నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ కు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
Next Story