Telugu Gateway
Latest News

ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ

ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ
X

బిడ్స్ దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 31

మరోసారి పొడిగింపు ఉండదు

ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ బాగానే పడింది. ఈ కారణంతో ఎప్పటికప్పుడు సర్కారు ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి బిడ్స్ దాఖలు గడువును పొడిగిస్తూ పోతోంది. ప్రస్తుతం ఉన్న గడువు ప్రకారం ఆగస్టు 31 లోగా ఆసక్తి ఉన్న సంస్థలు తమ బిడ్స్ దాఖలు చేయాల్సి ఉంది. మరోసారి ఈ గడువు పొడిగింపు ఛాన్స్ ఉండదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అయితే వ్యయాలను తగ్గించుకుని ట్రాక్ లో పెడితే ఎయిర్ ఇండియా మంచి లాభదాయక సంస్థ అవుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ వెంచర్ గా పలు సంస్థలు ఆసక్తి చూపినట్లు మంత్రి స్సష్టమైన సంకేతాలు ఇఛ్చారు. ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

ఇప్పటికే కేంద్రం ఎయిర్ లైన్స్ లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ)కు అనుమతి ఇచ్చింది. దీంతో తుది గడువు అయిన ఆగస్టు 31 నాటికి విదేశీ సంస్థలు కూడా లైన్ లోకి వస్తాయనే ధీమాతో కేంద్రం ఉంది. భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద పౌరవిమానయాన మార్కెట్ గా ఉందని..ఈ అంశాలు అన్నీ ఎయిర్ ఇండియా కొనుగోలు చేసే సంస్థకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. 435 మిలియన్ ప్యాసింజర్ల ఫుట్ ఫాల్ ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయని మంత్రి ప్రశ్నించారు. కోవిడ్ 19కు ముందు 17 శాతం వృద్ధి రేటు నమోదు అయిందని తెలిపారు. ఎయిర్ బబుల్స్ కోసం పలు దేశాలతో చర్చలు సాగుతున్నాయని తెలిపారు.

Next Story
Share it