Telugu Gateway
Latest News

అదానీ చేతికి ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం

అదానీ చేతికి ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
X

జీవీకె, అదానీల మధ్య ఒప్పందం ఖరారు

నియంత్రణా సంస్థల అనుమతులే తరువాయి

దేశీయ విమానయాన రంగంలో అదానీ గ్రూపు తన పట్టుపెంచుకుంటోంది. ఇఫ్పటికే ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆరు విమానాశ్రయాలను దక్కించుకున్న అదానీ గ్రూపు..ఇప్పుడు దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజారిటీ వాటాను దక్కించుకుంది. ఈ మేరకు ప్రస్తుతం మెజారిటీ వాటా ఉన్న జీవీకె ఇన్ ఫ్రాతో ఒప్పందం చేసుకుంది. రెండు కంపెనీలు ఈ విషయాన్ని లిస్టింగ్ ఒప్పందం ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్ లకు తెలియజేశాయి. అదానీ ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (ఏఏహెచ్ ఎల్) జీవీకె ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ (జీవీకె ఏడీఎల్) అప్పుల బాధ్యతను తీసుకోనుంది. ఈ మేరకు రెండు సంస్థలు ఒఫ్పందం కుదుర్చుకున్నాయి. జీవీకె గ్రూప్ నకు చెందిన జీవీకె ఎడీఎల్ కు ముంబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ (ఎంఐఏఎల్)లో 50.50 శాతం వాటా ఉంది.

నవీ ముంబయయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ లో 74 శాతం ఉంది. అదానీ గ్రూపు ఎంఐఏఎల్ లో అస్కా, బిడ్ వెస్ట్ లకు ఉన్న 23.5 శాతం వాటాలను కూడా తీసుకోనుంది. అయితే దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆప్ ఇండియా (సీసీఐ) అనుమతి పొందాల్సి ఉంటుంది. అదానీ ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ లిక్విడిటి సమస్యను తీర్చేందుకు ఎంఐఏఎల్ లోకి అదనపు నిధులు తీసుకురానుంది. ఇది నవీ ముంబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఫైనాన్షియల్ క్లోజర్ సాధించేందుకు, విమానాశ్రయ పనులు ప్రారంభించేందుకు ఉపయోగపడుతుందని అదానీ గ్రూపు వెల్లడించింది.

Next Story
Share it