లవర్ ను భర్తగా చూపెట్టి క్వారంటైన్ కు మహిళా కానిస్టేబుల్
BY Telugu Gateway17 July 2020 4:30 AM GMT

X
Telugu Gateway17 July 2020 4:30 AM GMT
ఆమె మహిళా కానిస్టేబుల్. ఇంకా పెళ్ళి కాలేదు. కోవిడ్ 19తో క్వారంటైన్ కు వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఆమె చేసిన పని చూసిన అధికారులు అవాక్కయ్యారు. తన లవర్ ను భర్తగా చూపెట్టి అతనితో కలసి క్వారంటైన్ కు వెళ్ళింది. భర్తగా చెప్పటంతో అధికారులు కూడా ఇద్దరినీ ఒకే చోట క్వారంటైన్ సెంటర్ లో ఉంచారు. వాస్తవానికి కానిస్టేబుల్ లవర్ గా చూపెట్టిన వ్యక్తికి ఇప్పటికే పెళ్లి అయింది.
అతనితో కానిస్టేబుల్ కు సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అయితే కోవిడ్ 19 పేరుతో క్వారంటైన్ సెంటర్ కు వెళ్ళాడో సదరు వ్యక్తి భార్య మాత్రం తన భర్త మూడు రోజులుగా ఇంటికి రాకపోవటంతో ఆందోళనగా తిరుగుతోంది. ఆమెకు మాత్రం అసలు విషయం తెలియదని అధికారులు వెల్లడించారు. ఇది అంతా నాగపూర్ లో జరిగింది.
Next Story