Telugu Gateway
Latest News

డ్రైవర్ రహిత కార్లకు చైనా రెడీ!

డ్రైవర్ రహిత కార్లకు చైనా రెడీ!
X

వుయ్ రైడ్. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ. ఈ సంస్థ డ్రైవర్ లేని కార్లను నడిపేందుకు దేశంలో తొలి లైసెన్స్ ను దక్కించుకుంది. చైనాలోని గ్యాంజు నగరంలోని ఎంపిక చేసిన రహదారులపై ఈ వాహనాలు నడపటానికి రంగం సిద్ధం అయింది. ఇలా బహిరంగ రహదారులపై డ్రైవర్ రహిత కార్లు నడిపేందుకు అనుమతి పొందిన వాటిలో చైనాలో తొలి కంపెనీ తమదేనని..ప్రపంచంలో రెండవ కంపెనీ అని తెలిపింది. తొలుత అమెరికాలో గూగుల్ లేబరరేటరీస్ ఈ ప్రయత్నం చేసింది. వుయ్ రైడ్ సంస్థ 5జీ ఆధారిత రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా అవసరం అయినప్పుడు వాహనాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది.

వుయ్ రైడ్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలైన రెనాల్ట్, నిస్సాన్ మోటార్, మిత్సుబుషి మోటార్ ల ఆటో సాంకేతిక సహకారంతో ప్రాజెక్టు చేసింది. వుడ్ రైడ్ కంపెనీ ఏర్పాటు అయిందే 2017 సంవత్సరంలో. అయితే కంపెనీ మాత్రం డ్రైవర్ లేకుండా రోబో ట్యాక్సీ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తేగలమనే ధీమాతో ఉంది. సాదారణంగా రహదారులపై నిర్వహించే రోడ్ టెస్ట్ లకు వేగ పరిమితి ఉంటుందని..అలాగే వుయ్ రైడ్ కార్లు 40 కెపీహెచ్ స్పీడ్ మించకుండా పరీక్షలు చేస్తామని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో డ్రైవర్ లేని కార్లు వాడకంలోకి రావటానికి చాలా సమయం పడుతుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

Next Story
Share it