Telugu Gateway
Latest News

కొత్త సెక్రటేరియట్ కడితే ఏడుపెందుకు?

కొత్త సెక్రటేరియట్ కడితే ఏడుపెందుకు?
X

తెలంగాణ మంత్రులు ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతికి సహకరించకపోగా ప్రతి దానికి అడ్డుపడుతున్నారని మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏమి కట్టినా ఏడుపు ఎందుకు అని మంత్రులు ప్రశ్నించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ , రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు మీడియతో మాట్లాడారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ‘.ఉత్తమ్ తాజా వ్యాఖ్యలు ఆయన బానిస మనస్తత్వానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం రావడం ఉత్తమ్ లాంటి వారికి ఇష్టం లేదు ..తెలంగాణ వచ్చి తమ అధికారం పోయిందనే భావన వారిలో ఉంది . హైదరాబాద్ లో సెక్షన్ 8 పెట్టాలనే అజ్ఞానపు డిమాండ్ చేస్తున్నారు. ఇపుడు రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉన్నపుడు సెక్షన్ 8 ప్రస్తావన అర్థరహితం. కాంగ్రెస్ నేతలు అజ్ఞానం ,మూర్ఖత్వం తో మాడ్లాడుతున్నారు.

తెలంగాణ రైతాంగం వైపే దేశం ఇపుడు చూస్తోంది. కరోనా కట్టడి లో తెలంగాణ యే దేశానికి దారి చూపింది. ప్రగతి భవన్ కడితే ఏడ్చారు ,ఇపుడు సచివాలయం కడుతుంటే ఏడుస్తున్నారు. సచివాలయం కడితే ఎందుకు ఏడుపు ?. సచివాలయం కడుతామని మా మేనిఫెస్టో లో చెప్పాము .మాకు ప్రజలు తీర్పు ఇచ్చారు. .మా మేనిఫెస్టో ను అమలు చేస్తే మీకెందుకు నొప్పి?. కాంగ్రెస్ హాయాం లో మేనిఫెస్టో అమలు చేసిన పాపాన పోలేదు. కాంగ్రెస్ లాంటి దరిద్రపు ప్రతిపక్షం దేశం లోనే లేదు. మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని అన్నారు. దేశానికి తలమానికంగా కొత్త సచివాలయం నిర్మిస్తామని తెలిపారు. ఢిల్లీలో కొత్త పార్లమెంట్ కట్టాలనుకోవటం లేదా? అని ప్రశ్నించారు. బిజెపి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మత రాజకీయాలు తప్ప బిజెపికి ఏమీ చేతకాదన్నారు.

Next Story
Share it