Telugu Gateway
Latest News

షాకింగ్ న్యూస్..కుక్కను రేప్ చేసిన 40 ఏళ్ళ వ్యక్తి

షాకింగ్ న్యూస్..కుక్కను రేప్ చేసిన 40 ఏళ్ళ వ్యక్తి
X

మనిషి కుక్కగా మారటం అంటే ఇదేనేమో. బహశా దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా ఇలాంటి సంఘటన జరిగినట్లు వార్తలు రాలేదు. తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది. అదేంటి అంటే ఓ నలభై సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఓ వీధి కుక్కను రేప్ చేశారు. ఈ అంశంపై ఫిర్యాదు రావటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. మహారాష్ట్రలోని థానేలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. కొంత మంది యువత అక్కడ నిత్యం వీధి కుక్కలకు ఆహారం పెడుతుంటారు. ఆ సమయంలోనే నిందితుడు కుక్కను రేప్ చేస్తూ వీరి కంటపడ్డాడు. జంతువుల హక్కుల రక్షణ కార్యకర్త అదితి నాయర్ ఈ అంశంపై మాట్లాడుతూ తాము థానే పోలీస్ కమిషనర్ కు ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

తొలుత పోలీసులు ఈ అంశంపై కేసు నమోదు చేయటానికి ఏ మాత్రం ఆసక్తిచూపలేదు. కమిషనర్ కు ఫిర్యాదు చేయటంతో ఆయన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. నిందితుడు స్కావెంజర్ పనిచేస్తాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 377 కింద (అసహజ సెక్స్) కేసు నమోదు చేశారు. దీంతోపాటు జంతువులను వేధించినందుకు మరో సెక్షన్ 11 (ఏ) కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story
Share it