రఫ్పాడించే ‘రాఫెల్’ విమానాలు ల్యాండ్ అయ్యాయి

శత్రు దేశాలను రఫ్పాడించటంలో సత్తా చాటే రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్ లో ల్యాండ్ అయ్యాయి. వీటి రాకతో భారత వాయుసేన మరింత శక్తివతంతం అయినట్లు అయింది. భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న కీలక తరుణంలో రష్యా నుంచి ఐదు రాఫెల్ విమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో సురక్షితంగా దిగాయి. రాఫెల్ యుద్ద విమానాలకు ప్రపంచంలోని అత్యుత్తమ విమానాలుగా పేరుంది. ఎన్నో ప్రత్యేకతలు గల రాఫెల్ విమానాల రాక భారత్ అమ్ములపొదిలో కొత్త అస్త్రం చేరినట్లు అయింది.
రాఫెల్ యుద్ధవిమానాలు అంబాలకు చేరుకోవటంతో వీటిని వైమానిక దళంలో చేర్చే కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. మార్గమధ్యంలో ఇవి యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. అక్కడ నుంచి బయలుదేరి భారత్ కు వచ్చేశాయి.