Telugu Gateway
Latest News

జియో ఫ్లాట్ ఫామ్స్ లో క్వాల్ కామ్ 730 కోట్ల పెట్టుబడి

జియో ఫ్లాట్ ఫామ్స్ లో క్వాల్ కామ్ 730 కోట్ల పెట్టుబడి
X

రిలయన్స్ జియోలోకి మరో కొత్త పెట్టుబడి వచ్చింది. కేవలం 0.25 శాతం వాటా కోసం క్వాల్ కామ్ వెంచర్స్ 730 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఏప్రిల్ 22 నుంచి జియోలోకి వచ్చిన 13వ పెట్టుబడి. క్వాల్ కామ్ వెంచర్స్ పెట్టుబడితో కలుపుకుంటే జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి వచ్చిన మొత్తం 1,18,318.45 కోట్ల రూపాయలు అయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో కంపెనీలకు ఏ విలువ ఆధారంగా వాటాలు కేటాయించారో అదే మాదిరి క్వాల్ కామ్ కు వాటాలు కేటాయించారు.

Next Story
Share it