స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలో పేటిఎం
BY Telugu Gateway24 July 2020 4:43 AM GMT

X
Telugu Gateway24 July 2020 4:43 AM GMT
ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం స్టాక్ బ్రోకింగ్ రంగంలోకి అడుగుపెడుతోంది. సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. మరికొన్ని వారాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. స్టాక్ బ్రోకింగ్ సేవలు ప్రారంభించేందుకు వీలుగా తాము ఇఫ్పటికే మార్కెట్ నియంత్రణా సంస్థ అయిన సెక్యూరిటీఎస్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) నుంచి అనుమతులు పొందినట్లు వెల్లడించారు. ఈ సేవలు పేటీఎం వెల్త్ ఫీచర్ కింద అందుబాటులో ఉంటాయన్నారు.
Next Story