Telugu Gateway
Latest News

గుడ్ న్యూస్..ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ విజయవంతం

గుడ్ న్యూస్..ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ విజయవంతం
X

వచ్చే నెలలోనే రష్యా వ్యాక్సిన్ రెడీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రముఖ యూనివర్శిటీ ఆక్స్ ఫర్డ్ సిద్ధం చేసిన వ్యాక్సిన్ తొలి దశ విజయవంతం అయింది. మనుషులపై నిర్వహించిన తొలి దశ ప్రయోగాలు పూర్తి సక్సెస్ అయినట్లు ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ చాలా మంచి ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని గుర్తించారు. వ్యాక్సిన్ ఇఛ్చిన వారిలో యాంటీ బాడీస్ పెరగటంతోపాటు కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన కణాలు కూడా పెంచినట్లు గుర్తించారు. రెండవ దశ, మూడవ దశ ఫలితాలు వెల్లడైన తర్వాత మాత్రమే ఈ వ్యాక్సిన్ ను వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. అన్ని వయస్సుల వారు..వివిధ ఆరోగ్య సమస్యల ఉన్న వారి విషయంలో ఈ వ్యాక్సిన్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది రాబోయే ఫలితాల్లో తేలనుంది. ఈ వ్యాక్సిన్ విజయంపై పలు దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ఆగస్టులోనే తమ వ్యాక్సిన్ వస్తోందని రష్యా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. రష్యాలోని సెచినోవ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ పలు కీలక దశలను అధిగమించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆ దేశ వైద్య శాఖ మంత్రి వ్యాక్సిన్ పై ప్రకటన చేయటం కీలకంగా మారింది. మూడవ దశ ఫలితాలు రాగానే ఇతర దేశాల్లో కూడా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి రష్యా ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకుంది.

Next Story
Share it