ఒకే రైల్వే స్టేషన్ ..రెండు రాష్ట్రాల్లో
BY Telugu Gateway6 July 2020 4:14 AM GMT

X
Telugu Gateway6 July 2020 4:14 AM GMT
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అదేంటి అంటే ఒకటే రైల్వే స్టేషన్..కాకపోతే అది రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. ఆ స్టేషన్ పేరే నవాపూర్. నవాపూర్ స్టేషన్ సూరత్ బుసావల్ మార్గంలో ఉంటుంది. ఈ స్టేషన్ మధ్యలోనే రెండు రాష్ట్రాల సరిహద్దులు ఉంటాయి.ఈ నవాపూర్ స్టేషన్ లో సగం గుజరాత్ రాష్ట్రంలోకి, మిగిలిన సగం మహారాష్ట్ర పరిధిలో ఉంటుంది.
భారతీయ రైల్వేలకు ఉన్న చరిత్ర ఎంతో ఘనమైంది. అంతే కాదు..ప్రపంచంలోనే ఎనిమిదవ అతి పెద్ద ఉపాధి కల్పించే సంస్థగా రైల్వే నిలుస్తుంది. భారతీయ రైల్వేకు అతి పెద్ద నెట్ వర్క్ ఉన్న విషయం తెలిసిందే. పైన ఉన్న బల్లపై కూడా ఓ వైపున మహారాష్ట్ర, మరో వైపున గుజరాత్ అని రాసి ఉన్న మార్కులను చూడవచ్చు.
Next Story