Telugu Gateway
Latest News

వారెన్ బఫెట్ ను దాటేసిన ముఖేష్ అంబానీ

వారెన్ బఫెట్ ను దాటేసిన ముఖేష్ అంబానీ
X

ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదవ స్థానం రిలయన్స్ అధినేతకు

స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ షేరు దూకుడు ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ సంపదను రోజు రోజుకూ పెంచుతోంది. ప్రపంచం అంతా కోవిడ్ 19తో అల్లకల్లోలం అవుతున్నా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలోకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించటంతోపాటు..సంస్థను రుణరహితంగా మార్చటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల జోరు కొనసాగుతోంది. దీంతో ఆయన ఇప్పుడు ఏకంగా బెర్క్ షైర్ హాత్ వే ఐఎన్ సీ ఛైర్మన్ అండ్ సీఈవో వారెన్ బఫెట్ ను దాటేశారు. బఫెట్ నికర విలువ ప్రస్తుతం 67.9 బిలియన్ డాలర్లకు పరిమితం అయింది.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నికర విలువ 68.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదవ స్థానానికి ముఖేష్ అంబానీ చేరుకున్నారు. వారెన్ బఫెట్ తొమ్మిదివ స్థానానికి పరిమితం అయ్యారు. బఫెట్ తాజాగా 2.9 బిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వటంతోపాటు ఆయన కంపెనీకి చెందిన షేర్లు పతనం కావటంతో ఆయన సంపద తగ్గుముఖం పట్టి ర్యాంకింగ్ లో వెనకబడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ టెన్ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు ఆసియా నుంచి చోటు దక్కించుకున్న ఏకైక పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మాత్రమే.

Next Story
Share it