Telugu Gateway
Latest News

గర్ల్ ప్రెండ్ తో..పెద్దలు కుదిర్చిన అమ్మాయితో ఒకేసారి పెళ్ళి

గర్ల్ ప్రెండ్ తో..పెద్దలు కుదిర్చిన అమ్మాయితో ఒకేసారి పెళ్ళి
X

ఇద్దరు అమ్మాయిలతో...ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు..ఇలాంటి టైటిళ్ళు అన్నీ తెలుగు సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఇది సినిమా కాదు. నిజంగా జరిగిన సంఘటన. ఓ వైపు చాలా మందికి పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు దొరక్క నానా కష్టాలు పడుతుంటే ..అతగాడు మాత్రం ఒకేసారి ఇద్దరికి తాళికట్టాడు. ఎప్పటి నుంచో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో తేడా పెరిగిపోతోందనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. అలాంటి తరుణంలో ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ఆ వ్యక్తి ఒకేసారి తన ప్రియురాలికి, పెద్దలు కుదిర్చిన సంబంధం తాలూకూ పెళ్ళికూతురికి ఒకేసారి తాళికట్టేశాడు. ఈ పెళ్ళి తతంగం అంతా కూడా మూడు ఫ్యామిలీల సమక్షంలోనే జరిగింది. ఇద్దరు అమ్మాయిలు అతనితో కలసి ఉండటానికి సిద్ధం అయితే రెండు పెళ్ళిళ్లు చేసుకోవటానికి ఆ గ్రామ పెద్దలు ఓకే చెప్పేశారు. అందుకు ఇద్దరు అమ్మాయిలు అంగీకరించారు. అంతే ఒకేసారి ఇద్దరిని పెళ్ళి చేసుకుని ఆ వ్యక్తి రికార్డులకు ఎక్కాడు.

Next Story
Share it