మధ్యప్రదేశ్ గవర్నర్ మృతి
BY Telugu Gateway21 July 2020 12:45 PM IST

X
Telugu Gateway21 July 2020 12:45 PM IST
గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. టాండన్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బీజేపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఆయన.. పలు ఉన్నత పదవులను చేపట్టారు. 2019 జూలై 20న మధ్యప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. కాగా నిన్నటితో తొలి ఏడాది పూర్తి చేసుకోవడం విశేషం. ఆయన గతంలో బిజెపిలో కీలక నేతగా ఉంటూ పలుమార్లు అసెంబ్లీ, మండలితోపాటు లోక్ సభకూ ఎన్నికయ్యారు.
Next Story