Telugu Gateway
Latest News

కేరళ గోల్డ్ కేసు..స్వప్న అరెస్ట్

కేరళ గోల్డ్ కేసు..స్వప్న అరెస్ట్
X

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన కేరళ బంగారం స్మగ్లింగ్ స్కామ్ లో కీలక పాత్రదారిగా అనుమానిస్తున్న స్వప్నసురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను శనివారం రాత్రి బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. స్వప్న సురేష్ తోపాటు సందీప్ నాయర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఎన్ ఐఏ అదుపులో స్వప్న, సురేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు. గత వారం రోజులుగా స్వప్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వప్నను పోలీసులు కొచ్చిన్ కి తరలిస్తున్నారు. యూఏఈ నుంచి కేరళకు నిబంధనలకు విరుద్ధంగా 30 కిలోల బంగారాన్ని తరలించారు. ఇది ఇప్పుడు కేరళలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.

ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేశ్‌ను సీఎం పినరయి విజయ్ కాపాడుతున్నారంటూ ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే ఆయన కూడా ఈ కేసులో లోతైన విచారణ అవసరం అని..అందుకు ఎలాంటి విచారణ జరిపించినా తాము సహకరిస్తామంటూ ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ రాశారు. ఈ కేసులో యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి సరిత్‌ కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. స్వప్న సురేశ్‌ను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. అటు కేరళ సర్కారు సీఎం ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ను తప్పించింది. స్వప్న సురేశ్‌ను ఐటీ శాఖలో నియమించడానికి, సీఎంవోలో స్వేచ్ఛనివ్వడానికి కారకుడంటూ ఆయనపై వేటు వేసింది.

Next Story
Share it