Telugu Gateway
Latest News

జియోలో ఇంటెల్ క్యాపిటల్ 1894 కోట్ల పెట్టుబడులు

జియోలో ఇంటెల్ క్యాపిటల్ 1894 కోట్ల పెట్టుబడులు
X

రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఇంటెల్ క్యాపిటల్ జియో ఫ్లాట్ ఫామ్స్ లో 1894.50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఈ మేరకు ఆ సంస్థకు 0.39 శాతం వాటా దక్కనుంది. ఇంటెల్ ఇన్వెస్ట్ మెంట్స్ తో కలుపుకుంటే ఇఫ్పటివరకూమొత్తం 12 సంస్థలు 1,17,588.45 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. ఇంటెల్ టెక్నాలజీ విభాగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు కేంద్రమైన సంస్థ అన్న సంగతి తెలిసిందే. గతంలో ఏ విలువ ఆధారంగా వాటాల కేటాయింపు జరిగిందో ఇప్పుడు ఇంటెల్ కు కూడా అదే లెక్కన ఈ వాటా కేటాయింపు చేయనున్నారు.

జియో టెక్నాలజీ సామర్ధ్యం, బిజినెస్ మోడల్ ను చూసే పలు దిగ్గ సంస్థలు వరస పెట్టి పెట్టుబడులు పెడుతున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ డీల్‌పై​ ఇరు సంస్థలు ఆనందాన్ని వెలిబుచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఇంటెల్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వినూత్న సంస్థలలో పెట్టుబడులు పెట్టడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ వంటి అంశాలపై దృష్టి సారించామని ఇంటెల్ క్యాపిటల్ తెలిపింది.

Next Story
Share it