Telugu Gateway
Latest News

ఇండిగో మూడు నెలల నష్టం 2844 కోట్లు

ఇండిగో మూడు నెలల నష్టం 2844 కోట్లు
X

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగోను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ భారీ నష్టాన్ని మూటకట్టుకుంది. 2020 ఏప్రిల్-జూన్ నాటికి అంటే మూడు నెలల కాలానికి 2844 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇండిగో లాభం 1203 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఐదేళ్ల కాలంలో ఇండిగో మూడు నెలల కాలానికి నమోదు చేసిన అతి పెద్ద నష్టం ఇదే. దీంతో పాటు తొలి మూడు నెలల కాలంలో కార్యకలాపాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 92 శాతం పడిపోయింది.

కరోనా కారణంగా విమానయాన రంగం భారీ నష్టాలను మూటకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే జూన్ నెలాఖరు నాటికి ఇండిగో వద్ద 18,449 కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉన్నాయి అందులో 7527 కోట్ల రూపాయలు ఫ్రీ క్యాష్ కాగా, మిగిలిన 10,922 కోట్ల రూపాయలు ఆంక్షలతో కూడిన నగదు అని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో పరిమిత స్థాయిలో విమాన సర్వీసులు నడుస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it