Telugu Gateway
Latest News

రైల్వేలకు ఈ ఏడాది 35 వేల కోట్ల నష్టం

రైల్వేలకు ఈ ఏడాది 35 వేల కోట్ల నష్టం
X

భారతీయ రైల్వేలు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క ప్రయాణికుల విభాగంలోనే ఏకంగా 35 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోనున్నాయి. కోవిడ్ 19 కారణంగా ప్రత్యేక రైళ్లు మినహా మిగతా రైళ్లు ఎక్కడికి అక్కడే ఆగిపోయిన విషయం తెలిసిందే. గత ఆర్ధిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగం ద్వారా రైల్వేలకు 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ మొత్తం కేవలం 10 నుంచి 15 శాతం మేర మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె యాదవ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 230 ప్రత్యేక రైళ్ళు 75 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయి.

కరోనా కంటే ముందు 13 వేల మెయిల్, ఎక్స్ ప్రెస్, సబర్భన్ రైళ్ళు నడిచేవి రోజుకు . ప్రయాణికుల విభాగంలో భారీ నష్టం వచ్చే అవకాశం ఉండటంతో అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా సరుకు రవాణా విభాగంపైనే ఆశలపెట్టుకుంది. అయితే ఈ ఏడాది సరుకు రవాణా ద్వారా 1.47 లక్షల కోట్ల రూపాయలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎంత మొత్తం వచ్చిందనే విషయాలను యాదవ్ వెల్లడించలేదు. అయితే గత ఏడాదితో పోలిస్తే సరుకు రవాణా మాత్రం 50 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story
Share it