Telugu Gateway
Latest News

భారత్ లో ఇక విదేశీ యూనివర్శిటీ క్యాంపస్ లు

భారత్ లో ఇక విదేశీ యూనివర్శిటీ క్యాంపస్ లు
X

విదేశీ విద్య ఇక దేశంలోనే. విదేశీ యూనివర్శిటీలు అంటే చాలా మందికి మోజు ఉండే విషయం తెలిసిందే. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవటం వల్ల అంతర్జాతీయ పరిస్థితులపై ఓ అవగాహన వస్తుందని..ఆ యూనివర్శిటీల్లో చదివితే జాబ్ గ్యారంటీ వంటి లెక్కలు చాలానే ఉంటాయి. అలాంటి విదేశీ యూనివర్శిటీలు ఇప్పుడు నేరుగా భారత్ లోకే ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. దేశ విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన కేంద్రం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విదేశీ యూనివర్శిటీలు క్యాంపస్ లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సంస్థల మధ్య సహకారం, విద్యార్ధులు, ఫ్యాకల్టీ లను అనుమతించటం ద్వారా విద్యను అంతర్జాతీయకరణ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్శిటీలను దేశంలో క్యాంపస్ లు పెట్టేందుకు అనుమతిస్తారు.

అయితే ఆ విద్యా సంస్థలు వసూలు చేసే ఫీజులకు సంబంధించిన పరిమితి విధిస్తారు. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు ప్రైవేట్ యూనివర్శిటీలకు గేట్లు తెరిచాయి. దీంతో పలు అగ్రశ్రేణి సంస్థలు ఈ బాట పడుతున్నాయి. ట్రస్ట్ ల ఏర్పాటు ద్వారా బడా బడా కార్పొరేట్ సంస్థలు యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఏకంగా విదేశీ యూనివర్శిటీల క్యాంపస్ లకే ఆమోదం తెలిపింది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్ధులు చదువు కోసం విదేశాలకు వెళుతున్నారు. గతంలో ఇదే బిజెపి దేశంలోకి విదేశీ విద్యా సంస్థల అనుమతిని వ్యతిరేకించిందని చెబుతున్నారు.

Next Story
Share it