Telugu Gateway
Latest News

రోజుకు లక్ష కేసులు ..ఇలా అయితే

రోజుకు లక్ష కేసులు ..ఇలా అయితే
X

‘తక్షణమే మేల్కొవాలి. లేదంటే పరిస్థితి అదుపు తప్పటం ఖాయం. ఇలా అయితే రోజుకు లక్ష కేసులు నమోదు అవుతాయి. ఇప్పుడు రోజుకు నలభై వేల కేసులు వస్తున్నాయి. కరోనా నియంత్రణలో పరిస్థితి అదుపు తప్పుతోంది. యువత లెక్కలేకుండా బార్లలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మరికొన్ని చోట్ల కనీసం మాస్కులు కూడా ధరించటం లేదు. ఇది ఏ మాత్రం వాంచనీయం కాదు’ అంటూ అమెరికాలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోని ఫౌసి హెచ్చరించారు. వెంటనే రంగంలోకి దిగి అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన కాంగ్రెస్‌కు సూచించారు. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం నిబంధలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అమెరికా మహమ్మారి నియంత్రణలో తప్పు దారిలో ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా కేసులు వ్యాపిస్తున్న తరుణంలో తక్షణమే ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యుఎస్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నప్పటి ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో సమావేశమవుతున్నారని, ముసుగులు ధరించడంలేదని ఫౌసీ ఆరోపించారు. లాక్ డౌన్ మార్గదర్శకాలపై అమెరికన్లు సరైన శ్రద్ధ చూపడం లేదన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నానన్నారు. 2.6 మిలియన్లకు పైగా కేసులు, లక్షా 26 వేల మరణాలతో ప్రపంచంలోనే అత్యంత కరోనా ప్రభావిత దేశంగా అమెరికా నిలిచింది.

Next Story
Share it