Telugu Gateway
Latest News

భారత్ లో గూగుల్ 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు

భారత్ లో గూగుల్ 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు
X

టెక్ దిగ్గజం గూగుల్ సోమవారం నాడు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఐదు, ఏడేళ్లలో గూగుల్ భారత్ లో ఏకంగా 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ మొత్తంలో కొంత ఈక్వీటీ రూపంలో, మరికొంత భాగస్వామ్యాల ద్వారా, భారతీయుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల అభివృద్ధి తదితర అంశాలపై ఉంటుందని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఇది ఎంతో ఊతం ఇస్తుందని తెలిపారు. సుందర్ పిచాయ్ ప్రకటన ద్వారా భారత్ లో గూగుల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెరగబోతున్నాయనే విషయం అర్ధం అవుతుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. గూగుల్ ఇండియ వర్చువల్ ఈవెంట్ లో మాట్లాడుతూ సుందర్ పిచాయ్ భారత్ లో పెట్టుబడుల అంశాన్ని వెల్లడించారు. డిజిటల్ ఎకానమీ విషయంలో భారత్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కలసి పనిచేయటం ద్వారా రానున్నవి మరింత మంచి రోజులు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పిచాయ్ తెలిపారు. అంతకు ముందు సుందర్ పిచాయ్ ప్రదాని నరేంద్రమోడీతో కూడా చర్చలు జరిపారు. కోవిడ్ 19 వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో ఏర్పడిన కొత్త పని విధానం తోపాటు వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ణానాన్ని అనుసంధానం చేయటం వంటి అంశాలపై చర్చించినట్లు ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా డిజిటల్ ఇండియాకు సంబంధించి ప్రధాని విజన్ ప్రశంసిస్తూ..తనకు సమయం కేటాయించినందుకు కూడా మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ పిచాయ్ ట్వీట్ చేశారు.

Next Story
Share it