Telugu Gateway
Latest News

ఆ హోటల్ లో అంతా ‘బంగారం’తోనే!

ఆ హోటల్ లో అంతా ‘బంగారం’తోనే!
X

అది ఓ ఫైవ్ స్టార్ హోటల్. ఓ రాత్రికి అద్దె భారతీయ కరెన్సీలో 18,600 రూపాయలు. ఇందులో బాత్ టబ్ నుంచి మొదలుకొని టాయ్ లెట్, స్విమ్మింగ్ పూల్ ప్రాంతం కూడా బంగారం కోటింగ్ తోనే ఉంటుంది. దీని కోసం ఈ హోటల్ ఏకంగా ఓ టన్ను బంగారాన్ని ఉపయోగించింది అంట. ఇది ఎక్కడ ఉంది అంటారా?. వియత్నాం రాజధాని హనోయ్ లో ఉంది. పూర్తిగా గోల్డ్ కోటెడ్ హోటల్ ను ఇటీవలే ప్రారంభించారు. మూడు నెలల కరోనా లాక్ డౌన్ తర్వాత హోటల్ ప్రస్తుతం పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఈ హోటల్ పేరు డాయిస్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్.

అమెరికాకు చెందిన వింధమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఐఎన్ సీ నిర్వహణలో ఉంది. ప్రస్తుతం ఈ తరహా హోటల్ ప్రపంచంలో ఎక్కడాలేదని హో బిన్ గ్రూప్ ఛైర్మన్ న్యుగోన్ హు డౌంగ్ వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే వియత్నాం కోవిడ్ 19ను ఎదుర్కోవటంలో విజయవంతం అయింది. ఎందుకంటే అక్కడ కేవలం 350 కేసులు మాత్రమే నమోదు కాగా..ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదు. తమ హోటల్ త్వరలోనే విదేశీ పర్యాటకులతో నిండిపోతుందని ఆశిస్తున్నట్లు నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it