Telugu Gateway
Latest News

ఊరిస్తున్న ‘రష్యా వ్యాక్సిన్’..ఆగస్టు 10 లేదా 12న విడుదల!

ఊరిస్తున్న ‘రష్యా వ్యాక్సిన్’..ఆగస్టు 10 లేదా 12న విడుదల!
X

వ్యాక్సిన్...వ్యాక్సిన్. అందరూ ఇఫ్పుడు ఇదే జపం చేస్తున్నారు. కరోనాకు ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది..ఎప్పుడు భయం లేకుండా బయట తిరగగలుగుతామన్న ఆశతో చూస్తున్నారు. అగ్రదేశాలు అన్నీ వ్యాక్సిన్ ను అందుబాటులో తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రపంచానికి ముందు అమెరికానే వ్యాక్సిన్ అందిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు రష్యా మాత్రం కాదు..కాదు..ముందు వచ్చేది మా వ్యాక్సిన్ మాత్రమే అంటోంది. అదే సమయంలో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి తాము ఎలాంటి మినహాయింపులు పొందలేదని..అన్నీ పక్కాగా..నిర్దేశిత సమయం ప్రకారమే చేశామని చెబుతోంది. రష్యాకు చెందిన వ్యాక్సిన్ ఆగస్టు 10 లేదా 12న విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి.

అయితే ముందు వైరస్‌ బారినపడిన వైద్యులకు సరఫరా చేసి, ఆ తరువాత ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గురువారం ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సెషనోవ్‌ వర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ తుది ప్రయోగాలను పూర్తి చేసుకునే దశలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రష్యాలోని సెషనోవ్‌ వర్సిటీ తయారు చేసిన టీకా ప్రపంచంలోనే తొలి కరోనా నిరోధక టీకా అని చెబుతున్నారు. గతంలో ఓ సారి ఆగస్టు 3 వ్యాక్సిన్ విడుదల అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తేదీ మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూడా వ్యాక్సిన్ తయారీనే ప్రధమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

Next Story
Share it