Telugu Gateway
Latest News

ఎడ్యుటెక్ మార్కెట్ 26 వేల కోట్లకు

ఎడ్యుటెక్ మార్కెట్ 26 వేల కోట్లకు
X

కోవిడ్ కారణంగా దేశ విద్యారంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడా స్కూళ్ళు, కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవటంతో అంతా ఆన్ లైన్ బాట పట్టారు. ఈ విద్యా సంవత్సరం అంతా ఎక్కువ ఆన్ లైన్ తప్పనిసరి అయ్యే పరిస్థితి కన్పిస్తోంది. కరోనా భయంతో అటు కాలేజీలు..ఇటు పాఠశాలలు తెరిచేందుకు యాజమాన్యాలు సిద్ధంగా లేవు. తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపటానికి కూడా ఆసక్తి చూపటం లేదు. ఈ తరుణంలో విద్యారంగంలో టెక్నాలజీ వ్యాపారం (ఎడ్యుటెక్) ఊపందుకుంటోంది.

కోవిడ్ 19 కారణంగా దేశంలోని ఎడ్యుటెక్ మార్కెట్ దాదాపు 26 వేల కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉందని ఓ సంస్థ అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ఊపందుకుంటోంది. ఎక్కడ చూసిన ఆన్ లైన్ క్లాస్ ల మాటే తప్ప..మరో మాట లేదు. ఇది అంతా కోవిడ్ తెచ్చిన కష్టాలు. ఆన్ లైన్ క్లాస్ ల వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలకు కళ్ళపై ఒత్తిడి పెరుగుతోంది. అయినా సరే పాఠశాలలు మరో మార్గం లేక ఇదే బాటను ఎంచుకుంటున్నాయి.

Next Story
Share it