Telugu Gateway
Latest News

మాస్క్ లు పెట్టుకోమని చెప్పను

మాస్క్ లు పెట్టుకోమని చెప్పను
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నా రూటే సపరేట్ అంటున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించటంతోపాటు భౌతిక దూరం పాటించాలని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ది కూడా ఇదే మాట. అయితే ట్రంప్ మాత్రం అమెరికా దేశ ప్రజలకు మాస్క్ పెట్టుకోమని చెప్పనంటే చెప్పనంటున్నారు. దేశ ప్రజలకు ఆ మాత్రం స్వేచ్చ ఉండొద్దా అని ప్రశ్నిస్తున్నారు. మాస్క్ పెట్టుకుంటే అన్నీ అయిపోతాయనే వాదన సరికాదని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం అవుతోంది.

ఓ వైపు వైట్ హౌస్ లోని కరోనా నియంత్రణ కమిటీలోని కీలక సభ్యుడు, ఆ దేశ అంటు వ్యాధుల నిపుణుడు అంటోని ఫౌచీ బలవంతంగా అయినా మాస్క్ లు ధరించేలా ఆయా రాష్ట్రాలు కృషి చేయాలని కోరారు. ఆయన చెప్పిన దానికి భిన్నంగా ట్రంప్ ప్రకటన చేయటం కలకలం రేపుతోంది. మాస్క్ లు ధరించటం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని ట్రంప్ చెబుతున్నారు. ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధిక ప్రభావానికి గురైన దేశం అమెరికానే. ఇప్పటికే అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. నిత్యం ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ట్రంప్ తాజాగా ఓ సారి మాస్క్ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాస్క్ లు ధరించమని ఒత్తిడి చేయలేమని ప్రకటించారు.

Next Story
Share it