Telugu Gateway
Latest News

కరోనా నుంచి రక్షణ పేరుతో పిల్లలకు మద్యం

కరోనా నుంచి రక్షణ పేరుతో పిల్లలకు మద్యం
X

ఆ పిల్లల వయస్సు 10 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం ఏభై మంది ఉన్నారు. కరోనా నుంచి రక్షణ కోసం అంటూ వాళ్ళను వరసగా కూర్చోపెట్టి మద్యం తాగించారు. అది కూడా స్థానికంగా తయారు చేసిన సలాపా మద్యం . ఇదంతా ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలో జరిగింది.

సంప్రదాయం పేరుతో పిల్లలకు కరోనా నుంచి రక్షణ ఇస్తుందని చెప్పి మద్యం తాగించటం ఏ మాత్రం సరికాదని జిల్లాకు చెందిన బాలల సంరక్షణ అధికారి నారాయణ దాస్ తెలిపారు. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ కూడా విచారణ జరుపుతోంది. కరోనా నుంచి రక్షణ కోసం అంటూ ఇలా రకరకరాల ప్రచారాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. వాటిని కొంత మంది సీరియస్ గా ఫాలో అవుతున్నారు కూడా.

Next Story
Share it