టిక్ టాక్ బ్యాన్..చైనా కంపెనీకి 45 వేల కోట్ల నష్టం!
BY Telugu Gateway2 July 2020 11:14 AM IST

X
Telugu Gateway2 July 2020 11:14 AM IST
బైట్ డ్యాన్స్. చైనాకు చెందిన దిగ్గజ ఇంటర్నెట్ కంపెనీ. దేశంలో ఎంతో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ ఈ కంపెనీదే. భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఎవరూ ఊహించని రీతిలో ఒకేసారి 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది. టిక్ టాక్, హెలో, విగో వీడియో ల వల్ల బైట్ డ్యాన్స్ ఏకంగా 45 వేల కోట్ల రూపాయలు (6 బిలియన్ అమెరికన్ డాలర్లు) నష్టపోయే అవకాశం ఉందని చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. మొత్తం యాప్ లతో కలుపుకుంటే ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బైట్ డ్యాన్స్ భారత్ లో ఏకంగా 7500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. భారత్ నిషేధంతో వీటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీజింగ్ కేంద్రంగా బైట్ డ్యాన్స్ కార్యకలాపాలు సాగిస్తోంది.
Next Story



