బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ లోగో విడుదల
BY Telugu Gateway20 July 2020 7:46 PM IST
X
Telugu Gateway20 July 2020 7:46 PM IST
కరోనా దెబ్బకు అసలు బిగ్ బాస్ ఉంటుందా.. ఉండదా? అన్న సందేహం అందరిలో నెలకొంది. కానీ ఈ అనుమానాలు అన్నింటిని పటాపంచలు చేస్తూ స్టార్ మా బిగ్ బాస్ 4 సీజన్ లోగోను విడుదల చేసింది. లోగోతోపాటు స్వల్ప నిడివి వీడియోను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
అలా లోగో విడుదల చేశారో లేదో బిగ్ బాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. త్వరలోనే బిగ్ బాస్ 4 సందడి ప్రారంభం కానుంది. లోగో విడుదల ద్వారా సీజన్ కొనసాగుతందని స్టార్ మా స్పష్టం చేసినట్లు అయింది. దీంతో ఇక చర్చ అంతా షో నిర్వాహకుడు ఎవరు...కంటెస్టెంట్లు ఎవరు అన్న వైపు మరలనుంది.
https://www.youtube.com/watch?v=PeGtR4lx7-c
Next Story