హోం క్వారంటైన్ లో సౌరవ్ గంగూలీ
BY Telugu Gateway16 July 2020 5:24 AM GMT

X
Telugu Gateway16 July 2020 5:24 AM GMT
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పుడు హోం క్వారంటైన్ లోకి వెళ్ళారు. దీనికి కారణం ఆయన సోదరుడు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(సీఏబీ) జాయింట్ సెక్రటరీ స్నేహాశీష్ గంగూలీకి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ ఆటగాడు స్నేహాశీష్ గంగూలీ చికిత్స కోసం ప్రస్తుతం బెల్లె వి ఆసుపత్రిలో చేరారు.
‘స్నేహాశీష్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా టెస్ట్ చేయగా అతడికి పాజిటివ్‌గా తెలిసింది. ‘రిపోర్ట్స్ బుధవారం సాయంత్రం వచ్చాయి. హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం సౌరవ్ కూడా కొద్ది రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది’ అని గంగూలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Next Story