Telugu Gateway
Latest News

బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేస్తే 50 కోట్ల షాక్

బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేస్తే 50 కోట్ల షాక్
X

బ్యాంకుల మాయలు అన్నీ ఇన్నీ కావు. ఎగవేతదారులకు వెతికి మరీ ఇస్తాయి. ఎవరైనా చిన్న చిన్న రుణాలు అడిగితే మాత్రం చుక్కలు చూపిస్తాయి. ఇది ఎప్పుడూ ఉండే కథే. కానీ ఈ వ్యవహారం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. సదరు బాధితుడి పేరు రాజ్ కుమార్. హర్యానాలోని కురుక్షేత్రలో ఓ టీ స్టాల్ నడుపుతాడు. కరోనా ముందు వరకూ టీ స్టాల్ లో మంచి గిరాకీ ఉండేది. ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ భయానికి బయటకు వచ్చే వారు బాగా తగ్గిపోవటంతో ఆ టీ స్టాల్ వ్యాపారం కూడా భారీగా పడిపోయింది.

అందుకే రాజ్ కుమార్ రుణం కోసం బ్యాంక్ కు దరఖాస్తు చేసుకున్నాడు. రుణం ఇవ్వకపోగా..దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది సదరు బ్యాంక్. అదేంటి అంటే..నువు అల్రెడీ బ్యాంకుకు 50 కోట్ల రూపాయల బాకీ ఉన్నావు కాబట్టి రుణం ఇవ్వం పొమ్మన్నారు. ఇది విన్న రాజ్ కుమార్ షాక్ కు గురయ్యాడు. అసలు తన పేరుతో ఎవరు రుణం తీసుకున్నారో....వివరాలు ఎవరు ఇచ్చారో అర్ధం కావటంలేదని చెబుతున్నాడు. అసలు తాను రుణమే తీసుకోలేదని..అలాంటిది తనను 50 కోట్ల రుణ డిఫాల్టర్ చెప్పటం ఏంటో విచిత్రంగా ఉందని వాపోతున్నాడు. ఇది బ్యాంకు నిర్వాహకులు చేసిన మోసంగా భావిస్తున్నారు.

Next Story
Share it