Telugu Gateway
Latest News

వార్షిక ఆదాయం 1.7 లక్షలు..స్విస్ ఖాతాలో 200 కోట్లు

వార్షిక ఆదాయం 1.7 లక్షలు..స్విస్ ఖాతాలో 200 కోట్లు
X

స్విస్ బ్యాంక్. ఇందులో నల్లడబ్బు దాచుకున్న బడా బాబులు ఎందరో. ఈ లెక్కలు ప్రజలకు ఓ పట్టాన ఎవరికీ అర్ధం కావు. అంతే కాదు. ఇందులో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచుకునేందుకు కూడా బినామీలను పెట్టుకుంటారా?. ఈ వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం రాకమానదు. ఎందుకంటే ఓ 81 సంవత్సరాల మహిళ తన వార్షిక ఆదాయం 1.70 లక్షల రూపాయలుగా చూపెట్టింది. ఆమె ముంబయ్ లో నివాసం ఉంటుంది.

కానీ ఆమె స్విస్ బ్యాంక్ లో దాచుకున్న అప్రకటిత డిపాజిట్ మొత్తం 200 కోట్ల రూపాయలకు పన్ను చెల్లించాలంటూ ముంబయ్ కు చెందిన ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఎస్ బీసీ అకౌంట్ లీక్స్ లో ముంబయ్ కు చెందిన రేణు టికమ్ దాస్ తరణి పేరు కూడా చోటుచేసుకుంది. 2014లో ఆమె ఈ ఖాతా ద్వారా ప్రయోజనం పొందినట్లు చెబుతున్నారు. అంతిమంగా ఏమి అవుతుందో ఈ లెక్క ఎప్పటికి తేలుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it