Telugu Gateway
Latest News

కరోనా పేషంట్ ఫోన్ చోరీ

కరోనా పేషంట్ ఫోన్ చోరీ
X

కరోనా. ఈ పేరు చెపితేనే ప్రస్తుతం జనం వణికిపోతున్నారు. కొంత మంది భయంతో అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచే బయటకు అడుగు పెట్టడం లేదు. కొంత మంది మాత్రం అసలు కరోనా ఎక్కడ ఉంది అన్న చందంగా హాయిగా తిరిగేస్తున్నారు. ఈ సమయంలో ఓ 22 సంవత్సరాల యువకుడు ఆస్పత్రిలో ఉన్న కరోనా పేషంట్ ఫోన్ చోరీ చేశాడు. ఇది విన్న వారంతా అవాక్కు అవుతున్నారు. అది కూడా ఐసోలేషన్ వార్డులో ఉన్న వ్యక్తి నుంచి ఫోన్ ఎత్తుకెళ్ళటం అంటే మామూలు విషయం కాదు మరి. అంతే కాదు..అలా చోరీ చేసిన వ్యక్తిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు కూడా.

ఈ ఘటన అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో జరిగింది. జెఎస్ఎస్ బి సివిల్ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతుండగా రాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్ ను తస్కరించాడు ఆ యువకుడు. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి పప్పు బర్మన్ గా గుర్తించారు. సదరు ఫోన్ పొగొట్టుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ యాక్టివ్ స్టేజ్ లో ఉంది. దీంతో ఈ మొబైల్ ఫోన్ కరోనా క్యారియర్ గా మారే ప్రమాదం ఉందని ఆస్పత్రి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు..ఈ ఫోన్ చోరీ చేసిన వ్యక్తికి క్వారంటైన్ చేసిన వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు.

Next Story
Share it